- చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో మృతి
గోదావరిఖని, వెలుగు: అన్నను రోకలిబండతో కొట్టగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన దాస సురేశ్, (38), నరేశ్, హరీశ్అన్నదమ్ములు. అడ్డగుంటపల్లిలో ఇంటి స్థలం విషయంలో సురేశ్, నరేశ్ మధ్య వివాదం ఉంది. ఇంటి స్థలాన్ని అమ్మాలని అన్నపై తమ్ముడు రెండేండ్లుగా ఒత్తిడి చేస్తున్నాడు.
సురేశ్ఒప్పుకోకపోవడంతో ఈ నెల 18న ఇద్దరూ మందు తాగి స్థలం విషయమై గొడవపడ్డారు. మందు మత్తులో తమ్ముడు నరేశ్.. రోకలిబండతో అన్న తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన సురేశ్‌ను కుటుంబసభ్యులు గోదావరిఖని హాస్పిటల్‌కు, అక్కడి నుంచి కరీంనగర్హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం సురేశ్చనిపోయాడు. మృతుడి చిన్న తమ్ముడు హరీశ్ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ప్రమోద్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.