నిజామాబాద్, వెలుగు : తనకు పెండ్లి కాకుండానే తమ్ముడు చేసుకున్నాడనే కోపంతో తమ్ముడుతో పాటు అతడి భార్యపై దాడి చేయబోయిన అన్న వారు దొరక్కపోవడంతో చివరకు వారుంటున్న ఇం టిని పెట్రోల్‌పోసి కాలబెట్టాడు. నిజామాబాద్‌కు చెందిన మజ్హర్, అమర్ అన్నదమ్ములు. అన్న మజ్హర్‌కు పెండ్లి కాలేదు. తమ్ముడు అమర్ హైదరాబాద్‌లో ప్లంబర్పని చేస్తూ ఓ యువతిని ఇష్టపడ్డాడు. ఏడాది కిందే నిశ్చితార్థం జరిగింది.
అయితే, తనకంటే ముందే తమ్ముడు పెండ్లి చేసుకుంటున్నాడని మజ్హర్కోపం పెంచుకున్నాడు. నచ్చజెప్పినా వినలేదు. అతడిని పట్టించుకోకుండా అమర్గురువారం ఎడపల్లిలో ముస్లిం సంప్రదాయం ప్రకారం పెండ్లి చేసుకున్నాడు. విషయం తెలిసి వారిపై దాడి చేయడానికి మజ్హర్వెళ్లగా వారు దొరకలేదు. మజ్హర్వెతుకుతున్నాడని తెలుసుకున్న కొత్త జంట శాంతినగర్‌లో ఉండే వధువు అమ్మమ్మ మౌలిబేగం ఇంటికి వెళ్లి తలదాచుకుంది. దీంతో శుక్రవారం రాత్రి అక్కడికి చేరుకున్న మజ్హర్ ఇంటిపై పెట్రోల్‌చల్లి ఇంటికి నిప్పుపెట్టాడు. ఫైరింజన్వచ్చి మంటలను ఆర్పేయడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఇంట్లోని సామగ్రి కాలిపోయింది. అయిదో టౌన్ఎస్ఐ అశోక్ ఘటనా స్థలాన్ని విజిట్‌చేసి కేసు నమోదు చేశారు.