భద్రాచలం,వెలుగు : భద్రాచలం వద్ద గోదావరిలో స్నానానికి దిగిన హైదరాబాద్కు చెందిన యువకుడు గల్లంతయ్యాడు. హైదరాబాద్కు చెందిన నలుగురు ఫ్రెండ్స్ఆదివారం శ్రీసీతారామచంద్రస్వామి దర్శనం కోసం వచ్చారు. స్నానాల రేవుకు దూరంగా దిగువన ఉన్న నదిలోకి దిగారు.
స్నానం చేస్తుండగా హరీశ్(28) గల్లంతయ్యాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరికి ఎగువ నుంచి వరద నీరు వస్తోంది. దీంతో అతడు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. మిగిలిన ముగ్గురు ఒడ్డుపైకి వచ్చి స్థానికులకు సమాచారమిచ్చారు. పోలీసులు, ఫైర్స్టాఫ్వచ్చి గజ ఈతగాళ్లతో గాలించారు. పడవలో దిగువన నెల్లిపాక వరకు వెళ్లి వెతికారు. కానీ, ఆచూకీ లభించలేదు.