ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇంద్రవెల్లి మండలం పిట్ట బొంగరం గ్రామానికి చెందిన యువకులు ఎండ వేడిని తట్టుకునేందుకు ఇలా హెల్మెట్‌కు కార్టూన్ బొమ్మలు ధరించి ప్రయాణిస్తూ కనిపించారు. వడగాలుల నుంచి కాపాడుకునేందుకు ఇలా చేసినట్లు చెప్పారు.
– వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్