బీర్‌‌బాటిల్‌‌లో సిగరెట్ ముక్క .. షాక్‌‌కు గురైన యువకులు

సంస్థాన్‌‌ నారాయణపురం, వెలుగు : బీర్‌‌ బాటిల్‌‌లో సిగరెట్‌‌ ముక్కలు కనిపించడంతో యువకులు షాక్‌‌కు గురయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌‌ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు గురువారం స్థానిక సరళ మైసమ్మ వైన్స్‌‌లో కింగ్‌ఫిషర్‌‌ బీర్‌‌ కొనుగోలు చేశారు. దానిని ఓపెన్‌‌ చేసే ముందు బాటిల్‌‌ను పరిశీలించగా అందులో సిగరెట్ ముక్కలు కనిపించాయి.

దీంతో యువకులు వైన్స్‌‌ నిర్వాహకులను నిలదీయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వైన్స్‌‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని యువకులు డిమాండ్‌‌ చేశారు. ఆబ్కారి ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.