iPhone Crash: ఐఫోన్లో ఇలా అస్సలు టైప్ చేయకండి.. చేశారంటే ఫోన్ పనికిరాకుండా పోయినట్టే..!

మీరు ఐఫోన్ వాడుతున్నారా..? ఎంతో ముచ్చటపడి ఐఫోన్ కొనుక్కున్నారా..? అయితే పొరపాటున కూడా ఐఫోన్లో  “”::” అని టైప్ చేయకండి. ఇలా టైప్ చేస్తే ఐఫోన్ క్రాష్ అవుతుందని సెక్యూరిటీ రీసెర్చర్ హెచ్చరించడం గమనార్హం. ఐఫోన్లో, ఐప్యాడ్స్లో కొత్తగా ఈ బగ్ను కనుగొన్నారు. సెట్టింగ్స్ యాప్లో సెర్చ్ బార్లో “”::” అని టైప్ చేస్తే ఐఫోన్ క్రాష్ అయిపోతుందని తెలిసింది. ‘‘ఇదంతా మేం నమ్మం’’ అనుకునే ఐఫోన్ యూజర్లు టైప్ చేసి ట్రై చేస్తే సరదా తీరిపోతుందని సమాచారం. ఇలా టైప్ చేయగానే ఐఫోన్ ఫ్రీజ్ లేదా రీబూట్ అవుతోందట. ఈ రెండింటిలో ఏది జరిగినా ఐఫోన్ యూజర్లు ఫోన్పై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అందువల్ల.. పొరపాటున కూడా ఐఫోన్ యూజర్లు ఈ లెటర్స్ టైప్ చేయొద్దని టెక్ నిపుణులు చెబుతున్నారు.

2015లో కూడా ఐఫోన్స్ ఇలాంటి బగ్ కారణంగానే చిక్కుల్లో పడ్డాయి. ఐఫోన్స్లోని మెసేజెస్ యాప్ బగ్ కారణంగా క్రాష్ అయింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఐఫోన్ క్రాష్ కు సంబంధించి కొందరు యూజర్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. కొందరు ఐఫోన్ యూజర్లు బగ్ కారణంగా సెట్టింగ్స్ క్రాష్ అయ్యాయని, మరికొందరేమో యాప్ లైబ్రరీ క్రాష్ అయిందని చెబుతున్నారు. ఐఫోన్స్ క్రాష్ అవుతున్నాయనే వార్తలపై  ఇప్పటికైతే యాపిల్ సంస్థ స్పందించలేదు. యాపిల్ ఈ బగ్కు పరిష్కారం కనుక్కునేంత వరకూ ఐఫోన్ యూజర్లు ఆ సీక్వెన్స్లో ఆ క్యారెక్టర్స్ టైప్ చేయకపోవడం మేలు. వీలుంటే.. ఐఓఎస్ సాఫ్ట్ వేర్ అప్ టూ డేట్ ఉండేలా చూసుకుంటే లేటెస్ట్ బగ్ బారి నుంచి ఐఫోన్ సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.