మేషం
ఆదాయానికి లోటు ఉండకపోయినా లేనిపోని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు క్రమేపీ తొలగుతాయి. తండ్రి తరఫు వారితో వివాదాలు సర్దుబాటు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కే ఛాన్స్. వారసత్వపు ఆస్తి దక్కవచ్చు. ప్రభుత్వ ఉద్యోగయత్నాలలో కదలికలు ఉంటాయి. వాహన సౌఖ్యం. వ్యాపార వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు, పనిభారం నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు అనుకున్నది సాధించేందుకు మరింత కృషి చేయాలి.
వృషభం
ఆదాయం గతం కంటే కాస్త మెరుగుపడుతుంది. రుణభారాల నుంచి కొంత విముక్తి. శుభకార్యాలపై బంధువులతో సంప్రదింపులు. నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు. వాగ్ధాటితో అందర్నీ మెప్పిస్తారు. భూ, వాహనయోగాలు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మీపై మరింత నమ్మకం పెరగడం వల్ల ప్రయోజనం సిద్ధిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారుల ప్రయత్నాలు సఫలీకృతం.
మిథునం
అనుకోని విధంగా కార్యక్రమాలు పూర్తి. సంఘంలో పేరుప్రతిష్ఠలుయి. అదనపు రాబడి. ప్రత్యర్థులను ఆకట్టుకుని లక్ష్యాలు సాధిస్తారు. భూములకు సంబంధించిన వివాదాలు వ్యక్తిగత చొరవతో పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం. మీడియా, సాంకేతిక రంగాల వారికి అనూహ్యమైన అవకాశాలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతలు తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు విశిష్ఠ గుర్తింపు.
కర్కాటకం
ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం. విద్యార్ధులకు విదేశీ విద్యావకాశాలు. భూవివాదాలు పరిష్కారం. ఆదాయం మెరుగుపడి అవసరాలు తీరతాయి. అరుదైన ఆహ్వానాలు. నూతన ఉద్యోగప్రయత్నాలు సానుకూలం. వాహన, గృహయోగాల సూచన. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధన లాభాలు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు శుభవార్తలు.
సింహం
ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు, ఫలితాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీపై వచ్చిన నిందలు సమసిపోతాయి. మీడియా, సాంకేతిక రంగాల వారికి శుభవార్తలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.
కన్య
శుభవార్తలు అందుతాయి. ముఖ్య కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి. ఆదాయానికి లోటు ఉండదు. ఖర్చులు అదుపు చేసుకుంటే మంచిది. తండ్రి తరఫు వారి సహాయసహకారాలు. నూతన ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆస్తి వ్యవహారాలలో అంగీకారానికి వస్తారు. వాహనసౌఖ్యం. సంతానపరంగా చిక్కులు తొలగుతాయి. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు దక్కవచ్చు. సాంకేతిక రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు మరిన్ని అవకాశాలు.
తుల
అదనపు ఆదాయం. మీపై ప్రశంసలు కురుస్తాయి. కొన్ని సమస్యలు తీరి మనశ్శాంతి చేకూరుతుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు వస్తాయి. ఎదురుచూస్తున్న ఆప్తుల రాక సంతోషం కలిగిస్తుంది. భూముల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. మనసుకు నచ్చిన నిర్ణయాలే తీసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు మంచి గుర్తింపు. క్రీడాకారులకు విశేష ఆదరణ లభిస్తుంది.
వృశ్చికం
శక్తిసామర్థ్యాలను నిరూపించుకుని ప్రశంసలు అందుకుంటారు. నూతన విద్యావకాశాలు దక్కవచ్చు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు సఫలం. ఒక సమాచారం మీ అదృష్టాన్ని మార్చే సూచనలు. అవసరాలకు తగిన ఆదాయం. ప్రత్యర్థులు మీ సత్తా గుర్తిస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. మీడియా, సాంకేతిక నిపుణులకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది.
ధనస్సు
దీర్ఘకాలిక రుణాలు కొన్ని తీరతాయి. విదేశీ విద్యావకాశాలు. ప్రముఖ వ్యక్తులు పరిచయమై సహకరిస్తారు. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. ఒక వ్యక్తి ద్వారా ప్రయోజనం కలుగవచ్చు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని సత్కారాలు. క్రీడాకారులుకు పురస్కారాలు.
మకరం
ప్రత్యర్థులను మెప్పించి మీదారికి తెచ్చుకుంటారు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలు కుటుంబసభ్యుల ఆమోదం పొందుతాయి. వివాహ యత్నాలు ముమ్మరం. ప్రముఖ వ్యక్తుల పరిచయం. వాహనాలు కొంటారు. ఉపాధి అవకాశాలు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో నైపుణ్యాన్ని నిరూపించుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. సాంకేతిక నిపుణులు, వైద్యులకు ప్రోత్సాహకరం.
కుంభం
ఆశించిన దానికంటే ఎక్కువగానే డబ్బు సమకూరుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు. ఎన్నడో దూరమైన సన్నిహితులు తిరిగి దగ్గరకు చేరతారు. వాహనాలు, గృహం కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పొరపాటు నిర్ణయాలను మార్చుకుంటారు. ఇంట్లో వేడుకలు నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహ పూరితంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు గుర్తింపు. పారిశ్రామికవేత్తలకు సత్కారాలు.
మీనం
సోదరులు, సోదరీలతో ఆస్తుల విషయంలో చర్చిస్తారు. తల్లి తరఫు వారి నుంచి సాయం అందుకుంటారు. ఇళ్ల కొనుగోలులో అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు. సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విజయాలే సిద్ధిస్తాయి. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులు సత్తా చాటుకుంటారు.