నడిరోడ్డుపై రీల్స్.. వెతుక్కుంటూ వెళ్లి మరీ యువకుడి సరదా తీర్చిన పోలీసులు

నడిరోడ్డుపై రీల్స్.. వెతుక్కుంటూ వెళ్లి మరీ యువకుడి సరదా తీర్చిన పోలీసులు

బెంగళూరు: రీల్స్ సరదా ఓ తుంటరి యువకుడిని జైలుపాలు చేసింది. రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుని టీ తాగుతూ రీల్స్ చేశాడు.. దీంతో పోలీసులు వెతుక్కుంటూ వెళ్లి అతడిని అరెస్టు చేసి ఆ వీడియోను ట్విట్టర్‎లో పెట్టారు. బెంగళూరులోని మాగడి ఏరియాలో ఈనెల 12న ఈ ఘటన జరిగింది. రీల్స్ చేసిన తర్వాత యువకుడు ఆ వీడియోను ఇన్ స్టాగ్రాంలో అప్ లోడ్  చేశాడు. అతని తీరుపై యూజర్లు తీవ్రంగా మండిపడ్డారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

యువకుడిని ట్రాక్ చేసి అరెస్టు చేశారు. రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుని టీ తాగుతూ వాహనదారులకు అతను ఇబ్బంది కలిగించాడని, ఆ యువకుడి తీరు కారణంగా అటుగా వెళ్లేవారి ప్రాణాలు సైతం రిస్కులో పడ్డాయని పోలీసులు ‘ఎక్స్’ లో తెలిపారు. ప్రజల జీవితాలు రిస్కులో పడేలా ఎవరైనా అలాంటి రీల్స్  చేస్తే, చట్టప్రకారం శిక్షించదగ్గ నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పబ్లిక్  సేఫ్టీ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.