
కరీంనగర్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 4వ తేదీ సోమవారం జిల్లాలోని ఇళ్ళందకుంట మండలం కనగర్తి గ్రామ సర్పంచ్ తల్లి మట్ట లచ్చవ్వ(65)పై యువకుడు కత్తితో దాడి చేశారు. లచ్చవ్వను కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో గ్రామస్థులు.. యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసుల అప్పగించారు.
యువకుడి దాడిలో గాయపడిన లచ్చవ్వను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. లచ్చవ్వ ఇంటి ముందు కూర్చోని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.