
- పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో బాధితుడు ఫిర్యాదు
- కులం పేరుతో తిట్టారని ఆరోపణ
- ఆలస్యంగా వెలుగులోకి..ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
జీడిమెట్ల, వెలుగు: దంపతుల మధ్య రాజీ కోసం వెళ్తే తనను నగ్నంగా వీడియోలు తీసి, కులం పేరుతో తిడుతూ ఇష్టమొచ్చినట్టుగా కొట్టారని ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పేట్ బషీరాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. గుండ్ల పోచంపల్లికి చెందిన చెందిన జి.కిరణ్ యాదవ్, అతని భార్య వినీత మధ్య కొంత కాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ విషయంలో తాను రాజీ కుదుర్చుకోవాలని అనుకుంటున్నానని వినీత తన స్నేహితురాలైన అనిశాకు చెప్పింది. దీంతో అనిశా అఫ్జల్‌గంజ్‌కు చెందిన తన సోదరుడు జె.తరుణ్‌కుమార్(26)ను రాజీ కుదుర్చాల్సిందిగా కోరింది. దీంతో దంపతుల మధ్య రాజీ కుదుర్చడానికి మార్చి 26న రాత్రి గుండ్లపోచంపల్లిలోని కిరణ్ఇంటికి వెళ్లాడు. దీంతో కిరణ్, అతని అనుచరులు కలిసి తనపై విచక్షణారహితంగా దాడి చేశారని తరుణ్ఆరోపించాడు.
అంతటితో ఆగకుండా కులం పేరుతో తిడుతూ నగ్నంగా వీడియోలు తీసి, వాటిని పలువురికి షేర్చేశారన్నారు. ఇదే విషయమై ఈ నెల 13న పేట్బషీరాబాద్పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా, కిరణ్యాదవ్తోపాటు మరో 5మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నారు.