మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ధాతియాలో ఇరుగు పొరుగు తగాదా తీవ్రరూపం దాల్చింది. నలుగురు దుండగులు ఓ యువకుడిని కొట్టి కోడిపిల్లలా కూర్చోబెటటొన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
బైక్ పై వెళ్తున్న ఓ యువకుడిని నలుగురు వ్యక్తులు అడ్డగించి మద్యం కోసం డబ్బులు డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో బెల్టుతో కొట్టి కోడి మాదిరిగా కూర్చోబెట్టారని దతియాస్ కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ధీరేంద్ర మిశ్రా తెలిపారు. , రాజ్‌ఘాట్ కాలనీలోని హనుమాన్‌ఘర్ దేవాలయం సమీపంలో ఈ సంఘటన జరిగింది. నిందితులను అభిషేక్ యాదవ్, గౌరవ్ తివారీ, అం కిత్ యాదవ్, ఛోటూ అలియాస్ అమిత్ యాదవ్‌లుగా గుర్తించారు. ఛోటూ అలియాస్ అమిత్ యాదవ్‌లు కొట్టినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు అభిషేక్ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగతా ముగ్గురి నిందితుల కోసం గాలిస్తున్నారు.
బాధితుడు, నిందితులు ఇరుగు పొరుగువారని పోలీసులు తెలిపారు. వారి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ఇరు వర్గాలపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపారు.