ఓరే నీచుడా.. : రోడ్డు పక్కనే యువతిపై అత్యాచారం..

ఓ యువకుడు శుక్రవారం పట్టపగలు ఫుట్‌పాత్‌పై మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఉజ్జయినిలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ సీఎం నియోజకవర్గమైన ఉజ్జయినిలో ఈ ఘటన చోటుచేసుకోవటం చర్చనీయాంశమయ్యింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... ఉజ్జయినిలోని కోయిలా ఫటక్ సెంటర్లో బుధవారం ఈ సంఘటన జరిగింది, నిందితుడు మహిళకు మత్తుమందు ఇచ్చి, పట్టపగలు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. అత్యాచారం తర్వాత మహిళను అక్కడే వదిలేసి పారిపోయాడు నిందితుడు.

నిందితుడు మొదట పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో మోసగించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో తీవ్ర దుమారం రేపడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వేగంగా చర్యలు తీసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.నిందితుడిని ఉజ్జయిని నివాసి లోకేష్‌గా గుర్తించారు. నగరంలోని కోయిలా ఫటక్ కూడలి సమీపంలో లోకేష్ తన వద్దకు వచ్చి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. పెళ్లి సాకుతో లోకేష్ ఆమెకు మద్యం తాగించి, ఆ తర్వాత బహిరంగంగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు లోకేష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై కోర్టు విచారం వ్యక్తం చేసింది. పట్టపగలే నడిరోడ్డుపై ఇంత దారుణం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్న ప్రజల ఉదాసీనతపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.