చొప్పదండి, వెలుగు: యాక్సిడెంట్ కేసులో తనకు శిక్ష పడుతుందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..కరీంనగర్జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంటకు చెందిన రాగం మహేశ్(32) ట్రాక్టర్ డ్రైవర్. 2016లో టూవీలర్‌పై వెళ్తూ యాక్సిడెంట్చేయగా ఓ వ్యక్తి చనిపోయాడు. మహేశ్‌పై కేసు ఫైల్‌కాగా కోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ కేసు జడ్జిమెంట్దశకు వచ్చిందని, కొద్దిరోజుల్లో తనకు శిక్షపడుతుందని భావిస్తూ బాధపడుతున్నాడు.
శుక్రవారం మహేశ్భార్య నిర్మల వ్యవసాయ పనులకు వెళ్లగా ఉదయం పురుగు మందు గుళికలు మింగాడు. గమనించిన పిల్లలు తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె స్థానికుల సాయంతో కరీంనగర్హాస్పిటల్కు తరలించింది. ట్రీట్మెంట్పొందుతూ చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు.