యాదాద్రి భువనగిరి జిల్లా BRS పార్టీ ఆఫీస్ పై యువజన కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. మీడియా సమావేశంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా యువజన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువజన కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పీఎస్ కు తరలించారు.
ALSO READ| కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ.. దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి: ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఇటీవలే హైదరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై ఇరు వర్గాలు దాడి చేసుకున్న సంగతి తెలిసిందే..ఈ సందర్భంగా పార్టీ ఆఫీసులపై దాడిని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. పార్టీ కార్యాలయాలపై దాడులు కరెక్ట్ కాదంటూ యూత్ కాంగ్రెస్ కు వార్నింగ్ ఇచ్చారు.