పార్టీ గెలవాలంటే యూత్ కాంగ్రెస్సే కీలకం: చైర్మన్ సమరత్

నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే యూత్‌ కాంగ్రెస్‌ కీలకంగా పనిచేయాలని ఆల్ఇండియా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌ చైర్మన్ సమరత్ మిశ్రా సూచించారు. బుధవారం నల్గొండ పట్టణంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ సమీక్షకు చీఫ్‌ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీకి యూత్ కాంగ్రెస్‌ నేతలు  వెన్నముక అని, పార్టీని ప్రతిగడపకు తీసుకుపోవడంలో కీలకంగా పనిచేశారని అభినందించారు.  

ALSO READ: మంత్రి అవినీతికి కాలనీలు బలి : రమేశ్ రెడ్డి

డోర్ టు డోర్ కార్యక్రమంలో నల్లగొండ అసెంబ్లీ, పార్లమెంట్ మొదటి స్థానంలో ఉందని ప్రశంసించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు, యూత్ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలుచేస్తామని స్పష్టం చేశారు.  అనంతరం డోర్ టు డోర్‌‌లో క్రియాశీలకంగా పనిచేసిన జహంగీర్, సిద్దు, శ్రీకాంత్, రహీం వంశీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌని రాజా రమేశ్ యాదవ్ , నేతలు  అభిజిత్,  గుమ్మల మోహన్ రెడ్డి,  గాలి నాగరాజు, కొప్పు నవీన్, రాజిరెడ్డి, నరేశ్ యాదవ్, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.