
హనుమకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దుండగుల దాడిలో పవన్ సృహ తప్పి కిందపడిపోయాడు. వెంటనే అతడిని కాంగ్రెస్ కార్యకర్తలు ఆస్పత్రికి తరలించారు. పవన్ పై ఎవరు దాడి చేశారనే దానిపై ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలోనూ పవన్ పాల్గొన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడే సమయంలో ఒక బిల్డింగ్ పై నుంచి ఫ్లెక్సీని ప్రదర్శించాడు. కాంగ్రెస్ సభ ముగిసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పవన్ పై దాడి చేశారు.