
హుజూరాబాద్ రూరల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను దూషించడం మానుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని యూత్ కాంగ్రెస్ లీడర్లు హెచ్చరించారు. శుక్రవారం హుజూరాబాద్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మకు పూలు, గాజులు పెట్టి గాడిదపై ఊరేగించారు.
అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ సంచలనాల కోసం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులను దూషించడం మానుకోవాలన్నారు. ఇంకోసారి ప్రభుత్వం సీఎం, మంత్రుల జోలికి ఆయన నియోజకవర్గంలో తిరగలేడని, అడుగడుగునా అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కమిటీ లీడర్లు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.