భీమదేవరపల్లి/ ధర్మసాగర్, వెలుగు: క్రీడల్లో గెలుపోటములు సహజమని వక్తలు అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో యూత్ కాంగ్రెస్ఆధ్వర్యంలో మండలస్థాయి క్రికెట్పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యూత్‌కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జక్కుల అనిల్, పార్టీ మండలాధ్యక్షుడు చిట్టంపల్లి అయిలయ్యతో కలిసి క్రీడాకారులకు టీచర్ట్లను పంపిణీ చేశారు.
కాజీపేట మండలం ఫాతిమా నగర్ సెయింట్ గాబ్రియల్ పాఠశాల మైదానంలో డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ ఎల్కతుర్తి మాజీ ప్రెసిడెంట్ జన్ను థామస్ రెండో వర్ధంతి సందర్భంగా వారి కొడుకులు జన్ను ఇవన్స్, జన్ను మార్టిన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు