హాయ్ రే హాయ్ : వర్షంలో.. నడి రోడ్డుపై లవ్ సాంగ్స్ డ్యాన్సులు

హాయ్ రే హాయ్ : వర్షంలో.. నడి రోడ్డుపై లవ్ సాంగ్స్ డ్యాన్సులు

వర్షాకాలం ప్రేమల కాలానికి ప్రసిద్ధి చెందింది. ఈ కాలంలో వర్షం శబ్ధం, బూడిద రంగులో ఉండే మేఘాలు, గాలులు అత్యంత రొమాంటిక్ మూడ్ ను సృష్టిస్తాయి. ఈ అద్భుతమైన వాతావరణంలో తమ అనుభూతులను, ఆనందాలను నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

ఈ రొమాంటిక్ సీజన్ లో మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ నుంచి పోస్ట్ అయిన ఓ ట్వీట్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఓ యువ జంట ఏ మాత్రం ట్రాఫిక్ లేని రోడ్డుపై వర్షంలో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వర్షాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తోన్న ఈ జోడీ అందర్నీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక రుతుపవనాలు మధ్యప్రదేశ్ కు చేరుకున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. భోపాల్, కట్ని, రైసెన్, విదిశా, నర్మదాపురం, జబల్ పూర్, షాడోల్, సియోని, సాగర్, సెహోర్, చింద్వారా, బాలాఘాట్, భేతుల్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

https://twitter.com/AgnihotriKartik/status/1673185644045033477