చదువుకున్నోళ్లూ హెల్త్‌‌ను పట్టించుకోవట్లే.. చిన్న వయసులోనే బీపీ, షుగర్, ఒబెసిటీ, HIV సమస్యలు

చదువుకున్నోళ్లూ హెల్త్‌‌ను పట్టించుకోవట్లే.. చిన్న వయసులోనే బీపీ, షుగర్, ఒబెసిటీ, HIV సమస్యలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చదువుకున్న యువత ఎక్కువగా ఉన్నప్పటికీ, హెల్త్​ విషయంలో మాత్రం వెనకబడుతున్నారు. ఆరోగ్యానికి సంబంధించి సరైన అవగాహన లేకపోవడంతో చిన్న వయసులోనే రోగాల బారినపడుతున్నారు. రాష్ట్రంలో 15–24 ఏండ్ల వయసున్న వారిలో 97 శాతం లిటరసీ రేటు ఉన్నట్టు సోషియో ఎకనామి ఔట్​లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం వెల్లడించింది. అబ్బాయిల్లో 98.16%, అమ్మాయిల్లో 95.48% మంది చదువుతో ముందున్నారు. 

కానీ ఈ చదువుకున్న యువతకు ఆరోగ్యం విషయంలో అవగాహన మాత్రం తక్కువేనని తాజా నివేదికలు చెబుతున్నాయి. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐవీ, హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్షన్, ఊబకాయం, డయాబెటీస్, డి విటమిన్​లోపం లాంటి సమస్యలు వీళ్లలోనే ఎక్కువగా వస్తున్నాయి. స్కూళ్లలో, కాలేజీల్లో ఆరోగ్యం గురించి సరైన ఎడ్యుకేషన్ లేదని, కనీస అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతోనే ఈ సమస్య వస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. 

యువత లైఫ్ స్టైల్​మారడం, ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ సేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఆరోగ్యం గురించి సరైన ఎడ్యుకేషన్​లేకపోవడం, చదువుకున్నోళ్లైనా రెగ్యులర్ హెల్త్ చెకప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేయించుకోకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమస్యలు వస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. 

దీంతో స్కూళ్లు, కాలేజీల్లో హెల్త్​ఎడ్యుకేషన్​పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సర్కార్ యోచిస్తున్నట్టు తెలిసింది. పాఠశాలల్లోనే పిల్లలకు నేర్పించేలా ప్లాన్​చేస్తున్నది. టీశాట్​లాంటి డిజిటల్ చానెళ్లతో గ్రామీణ యువతకూ అవగాహన కల్పించాలనుకుంటున్నది. గ్రామీణ ఏరియాల్లో మొబైల్ హెల్త్ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఫ్రీ చెకప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్వహించాలని భావిస్తున్నది. 

74% యువతకు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐవీపై అవగాహన లేదు.. 

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐవీ గురించి కూడా యువతలో సరైన అవగాహన లేదు. రాష్ట్రంలో 74% యువతకు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐవీ గురించి పూర్తి అవగాహన లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.3 లక్షల మంది హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐవీతో బాధపడుతున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. చదువుకున్న యువత కూడా సురక్షిత సెక్స్, రెగ్యులర్ టెస్టింగ్ గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య వచ్చినట్టు తెలిసింది.

ఇక కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్​చేసిన శాంపిల్​టెస్టుల అనాలసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ యూత్​వేగంగా వివిధ రోగాల బారిన పడుతున్నట్లు స్పష్టమవుతున్నది. 25 లక్షల మంది ఆరోగ్య పరీక్షల ఆధారంగా తెలంగాణ యువత సమస్యలను అపోలో హాస్పిటల్స్ 2025 నివేదిక బయటపెట్టింది. 

కాలేజీ విద్యార్థుల్లో 28% మందికి ఊబకాయం

కాలేజీ విద్యార్థుల్లో 28% మంది ఊబకాయంతో బాధపడుతున్నట్టు ఇందులో తేలింది. 19% మంది యువత బీపీతో బాధపడుతున్నారు. డయాబెటిస్ అంటే 40 ఏండ్లు, 50 ఏండ్లు ఆ తరువాత అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు పాఠశాల, కాలేజీ స్థాయిలోనే అంటే 30 ఏండ్లలోపు అది కూడా చదువుకున్న యువతలో ముఖ్యంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షుగర్ కేసులు పెరుగుతున్నాయి. 

రాష్ట్రంలో 81% యువతకు విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనమవుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 45 ఏళ్లు పైబడిన వాళ్లలో కేవలం 20% మందికే డిజిటల్ హెల్త్ గురించి తెలుసు. కానీ 98% మంది చదువుకున్న యువత హెల్త్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, టెలిమెడిసిన్ సులభంగా వాడగలరు. అయితే  వీళ్లు ఈ అవకాశాలను ఎక్కువగా వినియోగించుకోవడం లేదని వెల్లడైంది.