
-
పరిశ్రమలుపెడితే రుణాలు ఇప్పిస్తం
-
మహిళలను పారిశ్రామికంగా ప్రోత్సహిస్తం
-
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం: పరిశ్రమలు స్థాపించడానికి గ్రామీణ యువతను ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ మధిర నియోజకవర్గంలోని ఎండపల్లి లో ఇండస్ట్రియల్ పార్క్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే రుణాలు ఇప్పించి, వసతులు కల్పిస్తామన్నారు. వారి అవసరాలు తీర్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు ప్రతి ఏడాది రూ. 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు.
ప్రభుత్వమే పరిశ్రమలు, ప్రాజెక్టు రిపోర్టు, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ వసతులు కల్పించి పారిశ్రామిక రంగంలో మహిళలను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి మధి ర నియోజకవర్గంలో పునాది పడిందదన్నారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, సేవా రంగాలను అభివృద్ధి జరిగితేనే సమగ్ర అభివృద్ధి సాధిస్తామన్నారు. బ్యాంకుల నుంచి సకాలంలో రుణాలు ఇప్పించి వ్యాపారులను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. మధిరలో ఇండస్ట్రియల్ పార్క్ కు రూ. 44 కోట్ల నిధులు కేటాయించామన్నారు. వెంటనే టెండర్లు పిలిచి వేగంగా పనులు ప్రారంభించాలన్నారు.
ఇండస్ట్రియల్ పార్క్ రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండాలన్నారు. పార్కులో తక్కువ ధరలకే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్లాట్లు కేటాయిస్తామన్నారు. ప్లాట్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీల తోపాటు మహిళలకు రిజర్వేషన్లు పాటిస్తామన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను ప్రోత్సహించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. మధిర చుట్టూ బైపాస్ రోడ్లు నిర్మిస్తామన్నారు.