గచ్చిబౌలి, వెలుగు: దావత్ చేసుకుందాం రమ్మని చెప్పి, రాయదుర్గంలో ఓ యువకుడిని కొట్టి చంపారు. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకిలో ఉండే విశాల్‌సింగ్(32) హౌస్‌కీపింగ్ జాబ్ చేస్తుంటాడు. మణికొండకు చెందిన యువతి(25) టోలిచౌకిలోని విశాల్‌సింగ్ ఇంటి ముందున్న అమ్మమ్మ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేది. ఈ క్రమంలో తనను ప్రేమించాలని విశాల్ కొంత కాలంగా ఆమె వెంటపడుతున్నాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు అతన్ని మందలించారు. అయినా తీరు మారలేదు. అయితే యువతి సోదరుడు శ్యామ్, అర్జున్‌సింగ్, విశాల్సింగ్ఫ్రెండ్స్.. ఈ నెల 8న శాలరీ పడ్డాక దావత్ఇస్తానని చెప్పి శ్యామ్విశాల్సింగ్ను పిలిచాడు. రాత్రి 8 గంటలకు మణికొండకు రప్పించాడు. అక్కడ విశాల్‌సింగ్, శ్యామ్, అర్జున్ ముగ్గురూ కలిసి మద్యం తాగారు.
ఆ టైంలో విశాల్‌సింగ్ తాను శ్యామ్సోదరిని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. మద్యం మత్తులో యువతిని బూతులు తిట్టాడు. తట్టుకోలేకపోయిన శ్యామ్, అర్జున్‌సింగ్, మరి కొందరితో కలిసి విశాల్సింగ్పై కర్రలతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న విశాల్ సోదరుడు ఉదయ్ అక్కడికి చేరుకుని విశాల్‌ను అర్ధరాత్రి 12 గంటలకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 2 గంటలకు చనిపోయాడు. మృతుడి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విశాల్హత్యలో శ్యామ్, అర్జున్సింగ్తోపాటు సుమెన్, రాజేశ్, సోని, అరుణ్ పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.