13 నుంచి యువజనోత్సవాలు.. వరల్డ్ రోటరాక్టు డే సందర్బంగా నిర్వాహణ

13 నుంచి యువజనోత్సవాలు.. వరల్డ్ రోటరాక్టు డే సందర్బంగా నిర్వాహణ

బషీర్​బాగ్, వెలుగు: వరల్డ్ రోటరాక్టు డే సందర్బంగా మార్చి 13 నుంచి 19 వరకు తెలుగు రాష్ట్రాల్లో యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ మెజీషియన్, రోటరీ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ యూత్ చైర్మన్ టి.విజయకాంత్ తెలిపారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు వరల్డ్ రోటరాక్టు డే సందర్బంగా అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 

13న నిజాం కాలేజీలో యోగ, ట్రెడిషనల్ గేమ్స్ , 14న  చింతల్ లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మహిళా సాధికారతపై సదస్సు, 15న మురికి వాడల్లో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలు, 16న హిమాయత్ నగర్ లో యువజన అవగాహన సదస్సు, దివ్యాంగులతో టాక్ షో , 17న  శంషాబాద్ లో పారిశ్రామిక సదస్సు, 18న గుంటూరులో యూత్ టాలెంట్ షో, 19న  హిమాయత్ నగర్ సరిగా పాలస్ లో ముగింపు సభ ఉంటుందన్నారు. 

ఇందులో రోటరాక్టు ఆర్టిస్ట్ ఏరియా క్లబ్ ప్రారంభంతోపాటు మ్యాజిక్ షో లు, సినీ ఆర్టిస్టులతో ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవాళ్లు 9848061312 ను సంప్రదించాలని సూచించారు.