
పెద్దపల్లి జిల్లాలో యువకులు వీరంగం సృష్టించారు. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో దసరా ఉత్సవాలు జరిగాయి. ఈ సంబరాల్లో పాల్గొన్న యువకులు డ్యాన్స్లు చేస్తూ సందడి చేశారు. కారణం తెలియరాలేదు కాని.. కొంతమంది యువకులు కొట్టుకున్నారు. పిడిగుద్దులు.. కాళ్లతో తన్నుకుంటూ నానా హంగామా చేశారు. అక్కడున్న వారు కొంతమంది ఈ ఘటనను వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. స్టేడియం చుట్టూ పోలీసులు ఉన్నా ... ఈ గొడవ జరగడంతో అక్కడికి వచ్చిన జనం భయాందోళనకు గురయ్యారు. ఈ గొడవకు సంబంధించిన పూర్తివివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. .