గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజి నుంచి గన్నేరువరం వరకు రోడ్డుపై గుంతలు పూడ్చేందుకు శనివారం యువజన సంఘాల ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. యువజన సంఘాల నాయకులు జోలె పట్టి పలు గ్రామాల్లో తిరిగారు. తొలి రోజు వచ్చిన రూ. 25 వేలతో గన్నేరువరం నుంచి మాదాపూర్ రోడ్డుపై ఉన్న గుంతలు పూడ్చారు. ఈ సందర్భంగా యువజన నాయకుడు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ రోడ్డు వేయాలని పోరాటం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మండల ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. కనీసం రోడ్డుపై ఉన్న గుంతలు పూడ్చడం లేదని వాపోయారు. కార్యక్రమంలో యువజన నాయకుడు ఉపేందర్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, అనిల్, శ్రీధర్ రెడ్డి, నాగరాజు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.