బాచుపల్లిలో గన్తో యువకులు హల్చల్

 బాచుపల్లిలో గన్తో యువకులు హల్చల్

గ్రేటర్ హైదరాబాద్ బాచుపల్లిలో యువకులు గన్ తో హల్ చల్ చేశారు.  స్పోర్ట్స్ క్లబ్ దగ్గర కొందరు యువకులు తుపాకితో కనిపించారు. వారిని చూసి స్థానిక కాలనీల వాసులు భయాందోళన చెందారు. 

ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. యువకులు ఎవరు? వారికి తుపాకి ఎక్కడి నుంచి వచ్చిందనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ విషయం పోలీసులకు కూడా ఆలస్యంగా తెలియడంతో...ఘటపై ఆరా తీస్తున్నారు.