యూత్ డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. నయా ఇన్నోవేషన్స్ పై ఫోకస్ పెడుతున్నారు. చేసే పనిలో కొత్త కాన్సెప్ట్ ఉండాలంటున్నారు. అందుకే నేటి యంగ్ …. ఫుడ్ ఇండస్ట్రీ పై క్రేజ్ పెంచుకుంటున్నారు. చదువు ఏదైనా పర్లేదు.. బిజినెస్సే బెస్ట్ అంటున్నారు. కొత్త స్టార్టప్స్ తో ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నారు.
హైదరాబాద్ లో ఫుడ్ అండ్ క్లోథింగ్ ఇండస్ట్రీకి క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ఫుడ్ బిజినెస్ లో యూత్ తమదైన ముద్ర వేస్తున్నారు. సిటిలో పెరుగుతున్న మోడ్రన్ కల్చర్ ను దృష్టిలో పెట్టుకొని ఫుడ్ స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
డిగ్రీలు, పీజీలు చేసిన స్టూడెంట్స్.. రెగ్యులర్ జాబ్స్ చేయకుండా ఫుడ్ పై ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. స్టార్టప్ బిజినెస్ లో ఫారెన్ ఫుడ్స్ కి మన ఇండియన్ టేస్ట్ ను జోడించి..తక్కువ ధరలకే కొత్త రుచులను హైదరాబాదీలకు పరిచయం చేస్తున్నారు.
దోశా బండి నుంచి బిర్యానీ ఫుడ్ కోర్ట్ వరకు చిన్నగా స్టార్ట్ చేసి క్లిక్ అయితే ఏరియాకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు యంగ్ ఆంట్రప్రిన్యూయర్స్. సిటీలో మాల్స్ కల్చర్ పెరగడంతో రకరకాల బేక్డ్ ఐటమ్స్, బర్గర్స్, మిల్క్ షేక్స్, డ్రింక్స్ తో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసి బిజినెస్ చేస్తున్నారు.
డిఫరెంట్ గా ఏదైనా తినాలి అనుకునే వారికి న్యూ వెరైటీస్ పరిచయం చేస్తున్నారు ఫుడ్ ఆంట్రప్రిన్యూయర్స్. తక్కువ బడ్జెట్ లో మంచి లాభాలు పొందుతున్నారు. స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఈట్స్, ఫుడ్ పాండా లాంటి ఆన్ లైన్ బిజినెస్ పోర్టల్స్ తో కూడా టై అప్ అయి.. బిజినెస్ పెంచుకోవచ్చని చెబుతున్నారు.
కొత్తగా ఏదైనా చేయాలి అనుకునేవారికి ఫుడ్ స్టార్టప్ కాన్పెప్ట్స్ బాగా కలిసొస్తున్నాయి. మారుతున్న వ్యాపారాల ధోరణులను ఇప్పటి యువత ముందు ఆలోచనతో.. ఫుడ్ ఇండస్ట్రీలో వృద్ది సాధిస్తున్నారు.