
- మున్సిపల్ చైర్మన్ సారీ చెప్పాలని డిమాండ్
రామాయంపేట, వెలుగు: రామాయంపేట 11వ వార్డు కౌన్సిలర్ కు మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తూ బుధవారం ముదిరాజ్ యువకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. చైర్మెన్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రంజిత్ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.