కుటుంబ కలహాలతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కరావుపేటకు చెందిన మల్లేశానికి(28).. రాగోజి పేటకు చెందిన రాణితో వివాహం అయింది.
వీరికి 8 ఏళ్ల బాబు ఉన్నాడు. పెళ్లయిన కొన్నాళ్లకు దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య 6 నెలల కింద పుట్టింటికి వెళ్లిపోయింది.అప్పటి నుంచి మల్లేశం నానమ్మ గంగ మల్లవ్వ దగ్గర ఉంటున్నాడు.
ఇటీవల తన మామతో అతనికి గొడవ జరిగింది. ఈ క్రమంలో అల్లుడిపై అతను చేయి చేసుకుని.. మల్లేశంపై కేసు పెట్టాడు. భార్య దూరం కావడం, మామ ప్రవర్తనతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన సూసైడ్ చేసుకుంటున్నానని ఓ వీడియో తీసి వాట్సప్‌లో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి పంపించాడు.
ఆందోళనకు గురైన బంధుమిత్రులు వెతికారు. కానీ అతని ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో కంప్లెంట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.