
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఓ యువకుడు నిరసనకు దిగాడు. TRS నాయకుడు తన ఇంటిని ఆక్రమించుకున్నందుకు నిరసనగా ట్యాంక్ ఎక్కినట్లు చెప్పాడు. పాల్వంచ మండలం కిన్నెరసానిలోని తన ఇళ్లను TRS నాయకుడు కబ్జా చేసినట్లు చెప్పాడు. నాలుగేళ్లుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు అన్నాడు. ఇక న్యాయం జరగదనే చనిపోదాం అని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు గౌతం.