బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష

బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష

రంగారెడ్డి: గ్రామంలో బెల్టు షాపులవల్ల యువకుల నుంచి వృద్ధుల వరకు మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారని ఓ యువకుడి వినూత్న రీతిలో నిరసన తెలి పాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కందివనం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు గ్రామంలోని బెల్టు షాపులను తొలగించాలని నిరాహారదీక్షకు దిగాడు.

కందివనం గ్రామంలో 24 గంటలు బెల్టుషాపులు తెరిచి ఉంటున్నాయని, యువకులనుంచి ముసలోళ్ల వరకు మద్యానికి బానిసై ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారని నవీన్ ఆందోళన వ్యక్తం చేశాడు. గ్రామంలోని బెల్టు షాపులు మొత్తం ఎత్తేసే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని పట్టుబట్టాడు. గ్రామప్రజల బాగు కోసం దీక్ష చేపట్టిన నవీన్ కు మహిళలు అండగా ఉన్నారు. నవీన్ చేస్తున్న మంచిపనిని  గ్రామస్తులంతా మెచ్చుకుంటున్నారు.