ర్యాపిడో రైడర్లు జర జాగ్రత్త .. పాపం.. ఈ అన్న.. కస్టమర్ను ఎక్కించుకుని పోతుంటే..

ర్యాపిడో రైడర్లు జర జాగ్రత్త .. పాపం.. ఈ అన్న.. కస్టమర్ను ఎక్కించుకుని పోతుంటే..

హైదరాబాద్: కాచిగూడ రోడ్డులో ఘోర ప్రమాదం సంభవించింది. బైక్పై అతివేగంగా వచ్చి ర్యాపిడో బైకర్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు బైకర్స్ మృతి చెందిన ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎంజీబీఎస్ సమీపంలోని కలికాబర్ ప్రాంతానికి చెందిన రాందాస్ నాయక్వాడే ర్యాపిడో రైడర్గా పని చేస్తున్నాడు. 

ఈ నెల 15న రాత్రి తన ప్యాషన్ బైక్ (AP11AM8139) పై ర్యాపిడో డ్యూటీ కోసం ఇంటి నుంచి బయలుదేరాడు. రాందాస్ రాత్రి 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కాచిగూడ ఎక్స్ రోడ్స్ నుంచి కస్టమర్తో కుత్బిగూడ వైపు వెళ్లేందుకు టర్న్ చేస్తుండగా, కాచిగూడ రైల్వేస్టేషన్ వైపు నుంచి యమహా R15 బైక్ పై వచ్చిన రైడర్ అతివేగంతో రాందాస్ను ఢీకొట్టాడు.

ఈ ఘటనలో.. రైడర్లు ఇద్దరు కింద పడి తీవ్ర గాయాలు కాగా, ర్యాపిడో కస్టమర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. రైడర్లు రాందాస్ను స్థానిక సీసీ షరఫ్ హాస్పిటల్కు , యమహా రైడర్ చంద్ర శేఖర్ ను ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ రాందాస్ , చంద్రశేఖర్లు 16వ తేదీన మరణించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చంద్రశేఖర్ నగరంలో ఓ ప్రైవేట్ హాస్టల్ మేనేజర్గా పని చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస చారి తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.