కామారెడ్డి, వెలుగు: ఇటీవల వెలడించిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో సెలక్ట్ అయిన 22 మంది యువకులను కామారెడ్డి జిల్లా మున్నురుకాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. సంఘం జిల్లా ప్రెసిడెంట్ మామిండ్ల అంజయ్య మాట్లాడుతూ.. వృత్తిరీత్యా రాణించాలని కాంక్షించారు.
జిల్లా జనరల్ సెక్రెటరీ పెట్టిగాడి అంజయ్య, ప్రతినిధులు ఆంజనేయులు, శ్రీకాంత్, హన్మండ్లు, కృష్ణ, శేఖర్, లింగం, శ్రీనివాస్‌రావు, బాజ లలిత పాల్గొన్నారు.