యువత వ్యవసాయ రంగంలోకి రావాలి: జేడీ లక్ష్మీనారాయణ

యువత వ్యవసాయ రంగంలోకి రావాలి: జేడీ లక్ష్మీనారాయణ

జగిత్యాల రూరల్, వెలుగు: వ్యవసాయం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. దేశానికి సరిపడా ధాన్యం ఉత్పత్తి చేయాలంటే యువత వ్యవసాయంలోకి రావాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌‌‌‌‌‌‌‌లో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఏర్పాటు కార్యక్రమానికి ఆయన చీఫ్‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌గా హాజరై మాట్లాడారు. రైతులు తమ పంటను అమ్ముకోకుండా రైతు సంఘాల ద్వారా సొంతంగా ఫుడ్‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. లక్ష్మీపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామ రైతులు ఒకే పంట కాకుండా వివిధ రకాల పంటలను సాగు చేస్తూ అధిక దిగుబడులు పొందడం హర్షనీయమన్నారు.

వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి ఆర్గానిక్‌‌‌‌‌‌‌‌ వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ప్రతియేటా సాయిల్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ నిర్వహించి సాయిల్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ కార్డులు మంజూరు చేస్తూ, పంటలసాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వాలు కూడా ఆయా ఏరియాల్లో సాగయ్యే పంటలకు అనుగుమంగా ఫుడ్‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం రైతులు ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాన్ని, గో డౌన్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించి పంటల ఉత్పత్తి, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు.