జూబ్లీహిల్స్, వెలుగు: సినిమా ఆడిషన్స్కోసం వచ్చిన ఓ యువకుడు నిర్మాతను మద్యం మత్తులోకి దింపి నగలు, నగదు దోచుకెళ్లాడు. జూబ్లీహిల్స్డీఐ మధుసూదన్తెలిపిన ప్రకారం.. కృష్ణానగర్‌లోని లక్కీ రెస్టారెంట్బిల్డింగ్ లో శ్రీ భైనేష్ ప్రొడక్షన్పేరుతో టి.ఎల్లలు బాబు సినీ ఆఫీస్ ను 3 నెలల కిందట ఓపెన్ చేశాడు. యువకుడు శ్రీకాంత్(35) సినిమాల్లో చాన్స్ ల కోసం వచ్చి ఎల్లలు బాబును కలిశాడు.
అలా శ్రీకాంత్ తరచూ రావడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఈనెల 1న శ్రీకాంత్మరోసారి ఆఫీసుకు వచ్చాడు. అతనికి భోజనం తేవాలని ఎల్లలు బాబు చెప్పి పంపించాడు. భోజనంతోపాటు మద్యం కూడా తీసుకొచ్చాడు. ఇద్దరూ మద్యం తాగారు. ఎల్లలు బాబుకు మద్యం ఎక్కువవడంతో మత్తులోకి జారుకున్నాడు. అనంతరం ఎల్లలు బాబు ఒంటిపైన10 తులాల చైన్, 6 తులాల 3 ఉంగరాలు, రెడో వాచ్‌తో పాటు రూ.50 నగదు తీసుకుని శ్రీకాంత్ పారిపోయినట్టు గురువారం బాధితుడి కొడుకు ప్రవీణ్ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు.