ఒడిశాలోని కటక్లో దారుణం జరిగింది. అప్పు కట్టలేదని ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని స్కూటీకి కట్టేసీ ఈడ్చుకెళ్లారు. జగన్నాథ్ బెహరా అనే యువకుడు ఇద్దరు వ్యక్తుల వద్ద 1500 అప్పుగా తీసుకున్నాడు. సకాలంలో డబ్బు తిరిగివ్వలేకపోయాడు. దీంతో నిందితుడిని స్కూటీకి కట్టేసి 2 కిలోమీటర్లు లాక్కెళ్లిన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో హుస్సేన్, చోటు అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘‘ఈ ఘటనపై రాత్రి 11గంటలకు మాకు సమాచారం వచ్చింది. నిందితులను గుర్తించి అరెస్ట్ చేశాం. నిందితుల నేరచరిత్రను పరిశీలించిన తర్వాత కోర్టులో ప్రవేశపెడతాం’’ అని కటక్ డీసీపీ పినాక్ మిశ్ర తెలిపారు.