స్కూళ్లు, కాలేజీల్లో యువ టూరిజం క్లబ్​లు

స్కూళ్లు, కాలేజీల్లో యువ టూరిజం క్లబ్​లు
  • టూరిజం, వారసత్వ సంపదపై అవగాహన పెంచే చర్యలు
  • ప్రతి విద్యాసంస్థలో 25 మందితో కమిటీ
  • త్వరలోనే వారికి ట్రైనింగ్ ఇవ్వనున్న సర్కార్
  • ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తికి చర్యలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టూరిజం డెవలప్​మెంట్​తో పాటు వారసత్వ సంపద పరిరక్షణపై సర్కారు నజర్ పెట్టింది. దీంట్లో యూత్​, స్టూడెంట్లనూ భాగస్వాములు చేయాలని నిర్ణయించుకున్నది. దీనికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ‘యువ టూరిజం క్లబ్’ల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని స్వదేశీ టూరిజం అంబాసిడర్​లుగా మార్చాలని నిర్ణయించింది.

ఏడో క్లాస్​ నుంచి 29 ఏండ్ల లోపు వాళ్లు

దేశ యువతలో టూరిజం, సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన పెంచాలని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకున్నది. దీంట్లో భాగంగా యువ టూరిజం క్లబ్ (వైటీసీ)లను ఏర్పాటు చేయాలని రాష్ర్టాలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఉన్న నేపథ్యంలో.. దీంట్లో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొచ్చింది. ఈ కమిటీలు యువ టూరిజం అండ్ హెరిటేజ్ క్లబ్‎లుగా కొనసాగించేందుకు సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీనిలో ఏడో తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థుల నుంచి 29 ఏండ్లలోపున్న వారిని భాగస్వాములు చేయాలని డిసైడ్ అయ్యారు.  

27లోగా క్లబ్​ల  ఏర్పాటు

రాష్ట్రంలోని స్కూళ్లు, ఇంటర్ డిగ్రీ, పీజీ కాలేజీలతో పాటు ప్రొఫెషనల్, ఒకేషనల్ విద్యాసంస్థల్లో యువ టూరిజం క్లబ్​లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి విద్యాసంస్థలో 25 మందితో క్లబ్‏లను తయారు చేయనున్నారు. వీటిని రెగ్యులర్​గా పర్యవేక్షించేందుకు ఒక టీచర్/ లెక్చరర్ ను కోఆర్డినేటర్ గా నియమించనున్నారు. జిల్లాస్థాయిలోనూ ఒకరిని నోడల్ ఆఫీసర్ ను నియమించనుండగా, జిల్లా కలెక్టర్ వీటికి చైర్మన్​గా కొనసాగుతారు. ఈ క్లబ్ లను వరల్డ్ టూరిజం డే(ఈనెల 27)లోపే ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది. 

వ్యక్తిగతంగా ఈ క్లబ్​లను https://ytc.tourism.gov.in/club.registration లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టూరిజం ద్వారా కెరీర్ అవకాశాలపై ‘సోషియో ఎకనామిక్స్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ టూరిజం’ అనే అంశంపై సెమినార్లు, లెక్చరర్స్ ఇప్పించాలని సర్కారు నిర్ణయించింది. విద్యార్థులకు, యువతకు క్విజ్, వ్యాసరచన పోటీలు, లోగో డిజైన్స్, పోస్టర్, పెయింటింగ్ తదితర  పోటీలు నిర్వహించనున్నారు. విద్యాసంస్థలు ప్రతిఏటా ఈ క్లబ్​లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. క్లబ్​లు ప్రతినెలా సమావేశం నిర్వ హించాల్సి ఉంటుంది.


టూరిజం క్లబ్స్ పనులు..

 

  •     క్లబ్ పరిధిలోని ఊరు, మండలం, జిల్లాలోని  పర్యాటకం, సంస్కృతిక, చారిత్రక, వారసత్వ కోణంగురించి తెలుసుకోవాలి 
  •     ఏమైనా నిర్దిష్టమైన ప్రదేశం లేదా కల్చర్ పై డాక్యుమెంట్ తయారు చేయాలి
  •     ట్రావెల్, పర్యాటకంపై పోస్టర్, కథలనూ రూపొందించాలి     
  •     పర్యాటక ప్రదేశాలను గ్రూపులుగా వెళ్లి విజిట్ చేయాలి  
  •    వెబినార్లు, లెక్చర్లు, విద్యాశాఖ సిఫారసులు ఐఈసీ మెటీరియల్ చూడాలి 
  •    క్లబ్ యాక్టివిటీస్​ను ‘telanganatourism.gov.in’ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ చేయాలి 
  •    టూరిజం, వారసత్వ సంపదపై సాధారణ ప్రజల్లోనూ అవగాహన పెంచేందుకు కల్చరల్యాక్టివిటీస్ చేయాలె
  •     స్మారక చిహ్నాలను రక్షించేందుకు గానూ చర్యలు తీసుకోవాలి