యువతే టీఆర్‌ఎస్ పార్టీ సైన్యం అన్నారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌కు శ్రీరామ రక్షగా మారాయన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కేవలం మూడేళ్లలో చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్‌ది, టీఆర్‌ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు. దుబ్బాకలో కాంగ్రెస్, బీజేపీలు ఖాళీ అయ్యాయని… ఆ పార్టీల్లో ఉన్న నాయకులంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. ఇక మిగిలింది ఆ పార్టీల్లో కేవలం క్యాండిడేట్లు మాత్రమే… వాళ్లు కూడా ఎన్నికలు అయిపోగానే పత్తా లేకుండా పోతారన్నారు. జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న ఆ పార్టీలకు క్యాడర్ లేకుండాపోయిందన్నారు. దుబ్బాకకు ఎమ్మెల్యేగా తొలిసారిగా ఓ మహిళకు అవకాశం కల్పిస్తే… కాంగ్రెస్, బీజేపీ నాయకులు జీర్ణించుకోలేపోతున్నాయన్నారు.
దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నిక క్రమంలో ఆనాజ్‌పూర్, తిమ్మక్కపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ యువకులు హరీష్ రావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యువకులందరికీ గులాబీ కండువాలు కప్పి హరీష్‌రావు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.