వృద్ధుడి గొంతు కోసిన యువకులు.. బెయిల్‌పై ఉండగానే దాడి చేసిండ్రు

వృద్ధుడి గొంతు కోసిన యువకులు.. బెయిల్‌పై ఉండగానే దాడి చేసిండ్రు
  • విషమంగా బాధితుడి పరిస్థితి 
  • లైంగికదాడి కేసులో జైలుకు వెళ్లిన నిందితులు
  • కామారెడ్డి జిల్లాలో ఘటన


కామారెడ్డి: లైంగికదాడి కేసులో  బెయిల్​పై బయటకు వచ్చిన నిందితులు ఓ వ్యక్తిపై దాడి చేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లిలో  ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దివ్యాంగురాలి అయిన ఓ వృద్ధుడి కూతురిపై గతంలో నలుగురు యువకులు అత్యాచారం చేశారు. తండ్రి ఫిర్యాదుతో  యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

కేసు కోర్టులో ట్రయల్ నడుస్తోంది.  ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి నిందితులు బయటకు  వచ్చారు. ఈ క్రమంలో  వృద్ధుడిపై నిందితులు కోపం పెంచుకున్నారు. ఇవాళ ఆ వృద్ధుడిపై  ఇద్దరు యువకులు దాడి చేసి గొంతు కోసి  హత్యాయత్నం చేశారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.