ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను చితకబాదిన యువకులు

హైదరాబాద్ వనస్థలిపురంలో యువకులు వీరంగం సృష్టించారు.  సహారా రోడ్డులోని ఓ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. రోడ్డుపై పరుగెత్తుతూ ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు.  ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.  

అడ్డుకునేందుకుప్రయత్నించిన స్థానికులపై కూడా యువకులు దాడి చేశారు.  స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చారు పోలీసులు. దీంతో దాడిలో గాయపడ్డ వారి నుంచి వివరాలు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే  గొడవ పడ్డ వాళ్లు ఒకే కుటుంబానికి చెందిన బంధువులుగా గుర్తించారు.   ఇన్వెస్ట్ మెంట్ డబ్బుల విషయంలో  ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొందని తెలుస్తోంది.