జోరుగా మట్టి అక్రమ దందా

జోరుగా మట్టి అక్రమ దందా

మెదక్ (మనోహరాబాద్), వెలుగు:  మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి పీటీ  గ్రామంలో మట్టి అక్రమ దందా జోరుగా కొనసాగుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో గ్రామానికి చెందిన పలువురు సమీపంలోని ప్రైవేట్ కంపెనీకి కోనాయిపల్లి చెరువులో నుంచి  ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలించారు. 

దీంతో పలువురు యువకులు రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులకు ఫోన్‌ ద్వారా  ఫిర్యాదు చేశారు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. ఈ విషయమై మనోహరాబాద్ తహసీల్దార్​ భిక్షపతిని వివరణ కోరగా ఆర్‌‌ఐని పంపించి ఎంక్వైరీ చేస్తామని, నిజమేనని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.