కొట్టడమే కాదు.. కడుపునిండా భోజనం పెట్టడం కూడా తెలుసంటున్నారు ఈ యువకులు..దొంగతనానికి వచ్చిన వ్యక్తిని పట్టుకొని తీవ్రంగా కొట్టి..ఆ తర్వాత కడుపునిండా పులిహోర తినిపించారు. యువకులు మానత్వం ప్రదర్శించిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పోగల గణేష్ అనే దొంగ.. మంగళవారం ( సెప్టెంబర్ 17న) చోరీ చేసేందుకు యత్నించి గ్రామస్తులకు దొరికాడు. దీంతో యువకులంతా గణేష్ ను చితకబాదారు. మధ్యలో ఆకలిగా ఉందని గణేష్ చెప్పడంతో చలించిపోయారు.. గణేషుని ప్రసాదం పులిహోర కడుపునిండా తినిపించారు. ఆ తర్వాత దొంగ గణేష్ను పోలీసులకు అప్పగించారు.
ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతుండటంతో యువకుల్లో హ్యుమానిటినీ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.