ఫేక్ ఛానళ్లు, వెబ్సైట్లపై కేంద్రం కొరడా

భారత్‎కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 19 యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్సైట్లను కేంద్రం నిషేధించింది. ఇవన్నీ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇంటలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం మేరకు సమాచార, ప్రసార శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించి సున్నిత అంశాలపై అవాస్తవాలను ఈ ఛానెళ్లు ప్రచారం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లలో కాశ్మీర్, ఇండియన్ ఆర్మీ, రామ మందిరం, మైనార్టీలు, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్పై ఫేక్ న్యూస్ ప్రసారం చేసినట్లు కేంద్రం తెలిపింది. 

ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ ఛానళ్లలో ఖబర్ విత్ ఫ్యాక్ట్స్, ఖబర్ తైజ్, గ్లోబల్ ట్రూత్, న్యూ గ్లోబల్ ఫ్యాక్ట్స్, ఇన్ఫర్మేషన్ హబ్, ఫ్లాష్ నౌ, ఫైజల్ తరార్ స్పీక్స్, అప్పీ దునియా టీవీ, హకీకత్ కీ దునియా, షాజాద్ అబ్బాస్, మేరా పాకిస్తాన్ విత్ షాహబ్, ఖబర్ విత్ అహ్మద్, హెచ్ఆర్ టీవీ, సబీ కజ్మీ, సచ్ టీవీ నెట్ వర్క్, సాకిబ్ స్పీక్స్, సల్మాన్ హైదర్ అఫిషీయల్, సాజిద్ గోండల్ స్పీక్స్, మలీహా హాష్మే, ఉమర్ దరాజ్ గోండల్, ఖోజో టీవీ, ఖోజో టీవీ 2.0, కవర్ పాయింట్, జునైడ్ ఫ్లిక్స్, నేషనల్ స్టూడియో, ఇన్ఫర్మేటివ్ వరల్డ్, దునియా అఫిషీయల్, స్టూడియో 360, హకీకత్ టీవీ న్యూస్, హకీకత్ టీవీ 786, బోల్ మీడియా టీవీ, ఉర్దూ స్టూడియో, జకీ అబ్బాస్, వైట్ న్యూస్, డీనౌ ఉన్నాయి. వీటిలో చాలా వరకు పాకిస్థాన్‎కు చెందినవే కావడం గమనార్హం. ఈ యూట్యూబ్ ఛానళ్లన్నింటికీ కలిపి దాదాపు 1.2 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉండగా.. వీటి ద్వారా వచ్చిన వీడియోలకు 130 కోట్ల వ్యూస్ వచ్చాయి. పాకిస్థాన్ న్యూస్ ఛానళ్లకు చెందిన యాంకర్లే ఈ యూట్యూబ్ ఛానెళ్లలో చాలా వాటిని నిర్వహిస్తున్నారు. వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం, పౌరసత్వ సవరణ చట్టం తదితర అంశాలపై రెచ్చగొట్టే విధంగా కంటెంట్ పోస్టు చేసి మైనార్టీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తాజాగా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫేక్ న్యూస్ ప్రచారం ప్రారంభించాయి. ఈ క్రమంలో కేంద్రం ఐటీ రూల్స్ ప్రకారం యూట్యూబ్ ఛానళ్లు, వెబ్ సైట్లపై చర్యలు తీసుకుంది. అయితే, గత నెల 20 యూట్యూబ్ ఛానెళ్లను రద్దు చేసిన తర్వాత, ఈ ఛానెళ్లు తమంతట తాముగా భారత వ్యతిరేక కంటెంట్‌ను తొలగించినట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో మరిన్ని యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించే అవకాశముందని సమాచార, ప్రసార శాఖ తెలిపింది.

For More News..

ఇండిపెండెంట్‎ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ సీఎం

మేం అధికారంలోకి వస్తే ఇద్దరు సీఎంలు

తెలంగాణలో ముందస్తూ ఉండదు..వెనకస్తూ జరగదు

దేశాలు దాటిన ‘పుష్ప’ క్రేజ్