ఆర్జీయూకేటీలో మై విలేజ్ షో సందడి

ఆర్జీయూకేటీలో మై విలేజ్ షో  సందడి

భైంసా, వెలుగు: బాసర ట్రిపుల్​ఐటీలో ప్రముఖ యూట్యూబ్​ఛానల్ ​మై విలేజ్ షో బృందం సందడి చేసింది. వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ ఆదేశాలతో చేపట్టిన కార్యక్రమంలో 2000 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ, మై విలేజ్ షో వ్యవస్థాపకుడు శ్రీకాంత్, సభ్యుడు చందు, ఇన్‌ఫ్లుయెన్సర్ స్టీఫెన్ భాను హాజరయ్యారు. ఈ సందర్భంగా కంటెంట్ సృష్టి, వ్యవస్థాపకత, డిజిటల్ వృద్ధిపై అవగాహన కల్పించారు. గంగవ్వ మాట్లాడుతున్నంతసేపు స్టూడెంట్లు కేరింతలు కొట్టారు. 

ప్రశ్నోత్తరాల సెషన్ నిర్వహించి వారితో విద్యార్థులు నేరుగా సంభాషించే వీలు కల్పించగా మంచి స్పందన వచ్చింది. కార్యక్రమంలో వర్సిటీ ఓఎస్​డీ మురళి దర్శన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి, డాక్టర్ రాకేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.