ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది యూట్యూబ్ ఛానల్ విలేకరి

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది యూట్యూబ్ ఛానల్ విలేకరి

బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి కలకలం రేపుతోంది.  ఎన్నికల ప్రచారంలో భాగంగా  సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఓ పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా  దుండగుడు కత్తితో  దాడి చేశాడు.  షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చి కత్తితో డాడి చేశాడు. ప్రభాకర్ రెడ్డి పొట్టభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కొత్త ప్రభాకర్ రెడ్డిని హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వెంటనే అలర్ట్ అయిన బీఆర్ఎస్ నాయకులు అతడిని పట్టుకుని చితకబాదారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడు చెప్యాలకు చెందిన గటని రాజుగా పోలీసులు  గుర్తించారు.  అతను  ఓ యూ ట్యూబ్ చానల్  లో పని చేస్తున్న విలేకరిగా తెలుస్తోంది.

మరో వైపు  కొత్త ప్రభాకర్ రెడ్డిని మంత్రి హరీశ్ రావు ఫోన్ లో పరామర్శించారు. అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని సూచించారు.  కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ప్లాన్ ప్రకారం జరిగిందా? ఎందుకు దాడి చేశారనేది తెలియాల్సి ఉంది.