
అమెజాన్ ఫైర్ టీవీ యూజర్లకు ఇప్పటివరకు ఉన్న ఏకైక ఇబ్బంది ‘యూట్యూబ్’ స్ట్రీమింగ్ అవకాశం లేకపోవడం. అమెజాన్, గూగుల్ సంస్థల మధ్య నెలకొన్న గొడవల కారణంగా దాదాపు ఏడాదిన్నరక్రితం అమెజాన్ ఫైర్ టీవీలో గూగుల్‌కు చెందిన ‘యూట్యూబ్’ సేవలు నిలిచిపోయాయి. అలాగే గూగుల్‌కు చెందిన ‘క్రోమ్‌క్యాస్ట్’లో కూడా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ అందుబాటులో లేదు. అయితే తాజాగా అమెజాన్, గూగుల్ సంస్థలు ఒక ఒప్పందానికి రావడంతో రెండు స్ట్రీమింగ్ డివైజ్‌లలో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ ఫైర్ టీవీలో యూట్యూబ్యాప్ వాడొచ్చు. అలాగే గూగుల్ క్రోమ్క్యాస్ట్లో ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ను యూజ్ చేయొచ్చు. దీనికోసం లేటెస్ట్ ప్రైమ్ వీడియో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.