సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒకటే వీడియోస్, షార్ట్స్, రీల్స్.. చూస్తూ పోతే అలా వస్తూనే ఉంటాయి. వీడియో, షార్ట్స్ క్రియేటర్స్ కు యమ క్రేజ్ పెరుగుతుంది. చాలామంది తన ఫొటోస్, వీడియోస్ క్రియేట్ చేసుకోని దానికి మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సెట్ చేసుకొని పోస్ట్ చేస్తుంటారు. వాటికి లైక్స్, షేర్స్ రావడం కోసం గంటలు, గంటలు సమయాన్ని కేటాయించి మంచి వీడియోస్ క్రియేట్ చేస్తారు. ఈ పనిని ఈజీగా చేయడానికి చాలా యాప్ లు ఉన్నాయి. బాగా ఫేమస్ అయినవి మాత్రం ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్ టాక్ లతోపాటు కొన్ని యాప్ లు ఉన్నాయి. టిక్ టాక్ మూతపడటంతో యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ మధ్య బాగా పోటీ నడుస్తోంది. యాప్స్ తన యూజర్స్ ను గ్రాప్ చేసుకొని ఎంగేజ్మెంట్ పెంచుకోవడానికి కొత్త కొత్త ఫీచర్స్ ను తీసుకువస్తున్నాయి.
గతంలో యూట్యూబ్ కొలాబ్, ఫన్ ఎఫెక్ట్ అనే రెండు ఫీచర్స్ ను పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ రీమిక్స్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. యూట్యూబ్ లో షార్ట్స్ తీసేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. షాట్ క్రియేట్ చేసేటప్పుడు బ్యాగ్రౌండ్ లో పాటలు, మ్యూజిక్ లను డైరెక్టర్ గా రీమిక్స్ ఫీచర్ తో ఎడిట్ చేసుకోవచ్చు.
రీమిక్స్ ఎలా చేయాలి..?
రీమిక్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే సౌండ్, గ్రీన్ స్ర్కీన్, కట్, కొలాబ్ అనే నాలుగు ఆప్షన్స్ వస్తాయి. సౌండ్ పై క్లిక్ చేసి అక్కడ మీరు చేసే లైవ్ వీడియో లేదా ఆల్ రెడీ క్రియేటెడ్ వీడియోలో మ్యూజిక్ ను రీమిక్స్ చేసుకోవచ్చు. ఇక యూజర్స్ క్రియేటివిటీకి పని చెప్పవచ్చు.