YouTube:యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45లక్షల ఛానెళ్లు తొలగింపు..భారత్లో అత్యధికం

YouTube:యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45లక్షల ఛానెళ్లు తొలగింపు..భారత్లో అత్యధికం

హానికరమైన కంటెంట్ను కట్టడి చేసేందుకు యూట్యూబ్  స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తుంది. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో ఫేక్ కంటెంట్, విద్వేషపూరిత వీడియోలు, వేధింపులు, హింస వంటి వాటికి సంబంధించిన వీడియోలను గుర్తించి తొలగిస్తుంది. కేవలం మూడు నెలల వ్యవధిలో దాదాపు 95లక్షల వీడియోలు, 45లక్షల ఛానెళ్లను తొలగించింది. ముఖ్యంగా భారత్లో అత్యధిక తొలగింపులు జరిగాయి. దాదాపు 30లక్షల వీడియోలు తొలగించబడ్డాయి.

ఫేక్ కంటెంట్, విద్వేషపూరిత ప్రసంగాలు, హింస, వేధింపులు వంటి సమాచారాన్ని కట్టడి చేసేందుకు యూట్యూబ్ కఠిన చర్యలు అమలు చేస్తుంది. హానికరమైన కంటెంట్ ను కనుగొని తొలగించేందుకు AI టెక్నాలజీని వినియోగిస్తోంది. చెడ్డ వీడియోలు ఎక్కువ మంది చూడకముందే గుర్తించి తొలగిస్తుంది. వీటిలో ప్రమాదకరమైన కంటెంట్, వేధింపులు,హింసాత్మక దృశ్యాలు, స్పామ్, తప్పుదారి పట్టించే కంటెంట్ వీడియోలు య్యూట్యూబ్ తొలగించిన జాబితాలో ఉన్నాయి. 

ALSO READ | Movie Ticket Price: సినిమా టికెట్ రూ.200కే పరిమితం.. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ప్రొడ్యూస‌ర్లు,డిస్ట్రిబ్యూట‌ర్ల వ్య‌తిరేక‌త‌

2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో దాదాపు 95 లక్షలు వీడియోలు యూట్యూబ్ నుంచి తొలగించబడ్డాయి.  వీటిలో 30 వీడియోలు  భారత్ నుంచే ఉన్నాయి.పిల్లల భద్రతకు ముప్పు కలిగిస్తున్న్ సుమారు 50లక్షల వీడియోలను కూడా య్యూట్యూబ్ తొలగించింది. 
కేవలం వీడియోలు మాత్రమే కాదు.. యూట్యూబ్ 45లక్షల యూట్యూబ్ ఛానెళ్లను కూడా తొలగించింది. తొలగించిన ఛానెళ్లలో దాదాపు 54లక్షల వీడియాలో కూడా తొలగించారు. వీటితో పాటు 1కోటి2లక్షల కామెంట్లు  కూడా తొలగించబడ్డాయి.  
యూట్యూబర్లు ఎవరైనా కంటెంట్  కోల్పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా కంపెనీ రూల్స్ పాటించాలని, యూట్యూబ్ ప్లాట్ ఫాం భద్రతకు కంపెనీ కట్టుబడి ఉందని కంపెనీ చెబుతోంది. వీడియోలు అప్లోడ్ చేసే ముందు జాగ్రత్త వహించడం చాలా మంచిది.