ప్రతి ఐదుగురిలో నలుగురికి నచ్చే సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ యూట్యూబ్. ఇందులో షార్ట్ వీడియో క్రియేషన్ టూల్ YouTube Shorts కు యమ క్రేజ్ ఉంది. భారతదేశంలో 18 నుంచి 44 యేళ్లలోపు వాళ్లలో 96 శాతం మంది ఈ ఫ్లాట్ ఫారమ్ ను వినియోగిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా సగటున 70 బిలియన్ల రోజువారీ కస్టమర్లతో YouTube షార్ట్‌లు భారతదేశంలో జనాదరణ పొందుతూనే ఉంది. ఈ ఏడాది రోజువారీగా చూసేవారి సంఖ్య 120 శాతానికి పెరిగింది.
ఆన్ లైన్ వినియోగదారులలో 88 శాతం మంది కనెక్ట్ టెలివిజన్ (CTV) మోడ్ లోనూ.. షార్ట్ ఫారమ్ వీడియో కంటెంట్ ను చూడటం విశేషం.
గూగుల్ ఇండియాలో మార్కెటింగ్ పార్ట్‌నర్స్ డైరెక్టర్ సత్య రాఘవన్.. 15 ఏళ్లుగా భారతదేశంలో డిజిటల్ రంగంలో వచ్చిన మార్పులను గుర్తించారు. ఇందులో YouTube కీలక పాత్ర పోషించింది. ఎక్కువ మంది ఆన్‌లైన్ వినియోగదారులకు ఇష్టమైన ప్లాట్ ఫారమ్ గా YouTubeగాిమారింది. భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులలో వీడియోలను చూడటానికి YouTube అత్యధికంగా వినియోగిస్తున్నారు.
ALSO READ: అవాక్కయిన FB నెటిజన్లు : లోగో చూశారా.. బ్లూ కలర్ డార్క్ అయ్యింది..
జూన్ 2022 నుంచి జూన్ 2023 వరకు భారతీయ ఛానెళ్ల ద్వారా YouTubeలో అప్‌లోడ్ చేయబడిన కంటెంట్.. 40 శాతానికి పైగా పెరగడం విశేషం. 2023జూన్ లో 35 ఏళ్ల పైబడిన వారంతా రోజుకు 70 నిమిషాల కంటే ఎక్కువ సమయం YouTubeను వినియోగిస్తున్నారట.
ఈ పరిణామాలు దేశం డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో YouTube ప్రజాదరణ ప్రభావాన్ని చెప్పకనే చెబుతున్నాయి. సృష్టికర్తలు, ప్రకటనకర్తలకు ఒకే విధంగా అవకాశాలను అందిస్తోంది.