- తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తోటి నటి ఫిర్యాదు
- కేసు ఫైల్ చేసిన జూబ్లీహిల్స్‌పోలీసులు
జూబ్లీహిల్స్, వెలుగు: ప్రముఖ యూట్యూబ్స్టార్, నటుడు బెహరా ప్రసాద్‌ను జూబ్లీహిల్స్‌పోలీసులు అరెస్ట్‌చేశారు. తనతో వెబ్సిరీస్చేస్తున్న తోటి నటిని వేధించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం... మణికొండలో ఉంటున్న నటికి వెబ్‌సిరీస్‌ల టైంలో బెహరా ప్రసాద్పరిచయమయ్యాడు. కొన్నాళ్ల కింద షూటింగ్ టైంలో ప్రసాద్ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నటి సీరియస్అవ్వడంతో ప్రసాద్క్షమాపణలు చెప్పాడు. తాజాగా ‘పెళ్లివారమండి’ షూటింగ్ సమయంలో అందరి ముందు మరోసారి ప్రసాద్ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఈ నెల 11న జూబ్లీహిల్స్‌లోని సైలెంట్‌వ్యాలీ హిల్స్ లోని ప్లాట్నంబరు 998లో షూటింగ్పూర్తిచేసుకుని, ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్అందరి ముందు ప్రసాద్ఆమెను తాకడంతోపాటు కొట్టాడు. ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 14న పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న బెహరా ప్రసాద్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పెండ్లివారిమండి, మావిడాకులు, వింధ్యా విహారి వంటి వెబ్ సిరీస్‌లతో యూట్యూబ్‌లో ప్రసాద్ ఫేమస్ అయ్యాడు. ఈ ఏడాది రిలీజ్అయిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాలో లీడ్ రోల్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో సైడ్క్యారెక్టర్లు చేస్తున్నాడు.